రెండు బ్యాంక్ ఉద్యోగాలలో మెరిసిన గిరిజన తేజం

MHBD: తొర్రూరు మండలం కస్నా తండాకు చెందిన బానోతు అనూష రెండు బ్యాంకు ఉద్యోగాలు సాధించింది. 10వ తరగతి వరకు ZPHSలో చదివి, కాకతీయ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేశారు. చదువు మధ్యలోనే కానిస్టేబుల్ ఉద్యోగం సైతం ప్రయత్నం చేసిన, నిరాశ ఎదురైన, తన పట్టుదలతో బ్యాంకు ఉద్యోగ కోచింగ్ కోసం నంద్యాల వెళ్లి, SBIలో జూనియర్ అసోసియేట్, IDBIలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఎంపిక అయ్యారు.