బైక్ దొంగల హల్‌చల్
ప్రకాశం: త్రిపురాంతకంలో బైక్ దొంగలు హల్ చల్ చేస్తున్నారు. కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై ఉన్న మేడపిలో ముత్తలూరి బ్రహ్మం అనే గ్రామ సచివాలయం ఉద్యోగి బైక్‌ను ఎత్తుకొని వెళ్ళిన దొంగలు, మరొ రెండు బైకులకు తాళాలు రాకపోవడంతో అక్కడే వదిలేసి వెళ్ళి పోయారు. తన బైక్‌ను దొంగలు ఎత్తుకొని పోయారని ముత్తలూరి బ్రహ్మం పోలీస్‌లకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.