'80 శాతం పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలి'

'80 శాతం పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలి'

VZM: జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ తన క్యాంప్ కార్యాలయం నుంచి జేసీ, ఆర్డీవోలు, తహసీల్దార్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.శనివారం సాయంత్రానికి జిల్లావ్యాప్తంగా 80శాతం పాస్ పుస్తకాలు పంపిణీ లక్ష్యాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.