గొంతు కోసుకొని యువకుడి ఆత్మహత్యయత్నం

ADB: జిల్లా కేంద్రంలో ఓ యువకుడు గొంతు కోసుకోవడం కలకలం రేపింది. బుధవారం కొత్తకుమ్మరివాడ గౌరమ్మబట్టికి చెందిన తోట పురుషోత్తం ఉట్నూర్ మండలం హాసనాపూర్‌లో ఉన్న తన భూమిని ఇప్పించాలంటూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో గొంతు కోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు అతడిని రిమ్స్‌కు తరలించారు. గతంలోనూ గొంతు కోసుకొని ఇలాగే చేసారని ఎస్సై నాగనాథ్ తెలిపారు.