'రౌడీషీటర్లపై కఠిన చర్యలు'

'రౌడీషీటర్లపై కఠిన చర్యలు'

NDL: బేతంచెర్ల మండలంలోని గ్రామాల్లో అల్లర్లు, ఘర్షణలకు పాల్పడే రౌడీషీటర్లపై కఠిన చర్యలు తప్పవని సీఐ వెంకటేశ్వరావు ఆదివారం హెచ్చరించారు. పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించి, సమాజంలో ప్రశాంతంగా జీవించాలని సూచించారు. అల్లర్లకు పాల్పడకూడదని స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకాలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.