'అస్తవ్యస్తంగా డ్రైనేజ్.. చర్యలు తీసుకోండి'

'అస్తవ్యస్తంగా డ్రైనేజ్.. చర్యలు తీసుకోండి'

KNR: శంకరపట్నం మండలం వంకాయగూడెం 1 వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉందని, దుర్గంధం వెదజల్లడంతో రోగాల బారిన పడే ప్రమాదం ఉందని బూర్ల శ్రీనివాస్ తెలిపారు. శ్రీనివాస్ మాట్లాడుతూ.. 2, 3, 4 వార్డుల డ్రైనేజీ అంతా తన ఇంటి ముందున్న డ్రైనేజీలోకి చేరుతుందన్నారు. గ్రామపంచాయతీ అధికారులకు తెలిపినా ఫలితం శూన్యం అన్నారు. మండల అధికారులు చొరవ తీసుకోవాలన్నారు.