VIDEO: 'అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై కఠిన చర్యలు'
కృష్ణా: గండిగుంటలో కబ్జాకు గురైన పంచాయతీ లేఔట్ స్థలాలను డీపీవో అరుణ గురువారం పరిశీలించారు. ఈ నేపథ్యంలో కామన్ సైట్లను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు గుర్తించారు. పంచాయతీకి సంబంధించిన ఆస్తులు ఎవరి చేతిలో ఉన్నా వాటిని స్వాధీనం చేసుకుంటామన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై, సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.