VIDEO: చంద్రబాబు చిత్రంపై పేపర్ అతికింపు

కృష్ణ: ఉంగుటూరు మండలం తేలప్రోలు పంచాయతీలో చంద్రబాబు చిత్రంపై పేపర్ అతికింపు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తేలప్రోలు సచివాలయం-1 మెయిన్ గేట్ వద్ద ఉన్న సీఎం చంద్రబాబు చిత్రంపై గుర్తుతెలియని వ్యక్తులు పేపర్ అతికించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆ పేపర్‌ను తొలగించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు.