ఎస్ రాజంపేటలో ఇరు వర్గాలు ఘర్షణ

కడప: సిద్దవటం మండలంలోని ఎస్ రాజంపేట బీసీ కాలనీలో ఓ చిన్న వివాదం ఘర్షణకు దారితీసింది. ఆస్తి తగదానికి సంబంధించి జరిగిన ఘర్షణలో కృష్ణవేణి, విష్ణు, గోపాలయ్యకు గాయాలయ్యాయి. గాయపడిన వీరిని స్థానికులు చికిత్స కోసం కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.