VIDEO: యూరియా బుకింగ్ యాప్‌పై రైతులకు అవగాహన
SRD: సిర్గాపూర్ రైతు వేదికలో ఇవాళ వ్యవసాయ శాఖ అధికారిక వాట్సాప్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని రైతులు వీక్షించారు. ఇందులో ప్రధానంగా మొబైల్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసే విధానంపై అవగాహన, యూరియా తగిన మోతాదులో వాడటం, ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. శాస్త్రవేత్తలతో రైతులకు ముఖాముఖి సందేహాలను నివృత్తి చేశారు.