గుండెపోటుతో డిగ్రీ విద్యార్థిని మృతి

NTR: నందిగామలో విద్యార్థిని నాగలక్ష్మి(18) గుండెపోటుతో మృతిచెందింది. అనాసాగరం గ్రామానికి చెందిన నాగలక్ష్మి నందిగామలోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. సోమవారం సాయంత్రం 4:30 గంటల సమయంలో కళాశాల నుంచి స్నేహితురాళ్లతో సదరు విద్యార్థిని బయటకు వచ్చింది. నడుస్తూనే ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయింది.