నేడు అక్షర సూరీడు అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి
JGL: జగిత్యాల పట్టణంలో అక్షర సూర్యుడు అలిశెట్టి ప్రభాకర్ జయంతి మరియు వర్ధంతి కార్యక్రమాన్ని బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగడి బజార్‌లో వారి విగ్రహానికి జిల్లా తొలి జడ్పీ ఛైర్‌పర్సన్ దావ వసంత సురేష్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ శీలం ప్రియాంక ప్రవీణ్, పద్మశాలి సంఘం సభ్యులు పాల్గొన్నారు.