ఉన్నం హనుమంతరాయ చౌదరి ఆరోగ్యం విషమం
ATP: కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి ఆరోగ్యం క్షీణించింది. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు చికిత్స కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. సోమవారం ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్లు సమాచారం అందడంతో అభిమానులు, రాజకీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.