సన్‌రైజర్స్ సారథిగా కమిన్స్ కొనసాగింపు
2026 IPL సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా మరోసారి ప్యాట్ కమిన్స్ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. 2024 సీజన్‌లో SRH పగ్గాలు చేపట్టిన కమిన్స్.. జట్టును అద్భుతంగా ముందుకు నడిపించాడు. అతడి సారథ్యంలో SRH 2024లో ఫైనల్ వరకు చేరుకుంది. దీంతో అతనిపై విశ్వాసం ఉంచుతూ వచ్చే సీజన్‌కు కూడా అతనే కెప్టెన్‌గా ఉంటాడని నిర్ణయించినట్లు సమాచారం.