జిల్లాలో విదేశీ పక్షుల సందడి

జిల్లాలో విదేశీ పక్షుల సందడి

ATP: వేలాది కిలోమీటర్ల దూరం నుంచి రివ్వున ఎగురుతూ వచ్చిన విదేశీ అతిథి పక్షులు జిల్లాలో సందడి చేస్తున్నాయి. రంగురంగుల 32 విదేశీ పక్షి జాతులు ఇక్కడకు చేరుకున్నట్లు అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ జువాలజీ పరిశోధకులు తెలిపారు. ఈ పక్షుల కిలకిలరావాలు, అందాలు ప్రకృతి సోయగాలను పెంచుతూ జిల్లా వాసులకు సరికొత్త అనుభూతినిస్తున్నాయి.