రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

అన్నమయ్య: రాయచోటి పట్టణంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభావతి (48) అనే మహిళ మరణించింది. భర్తతో కలిసి పెళ్లికి వెళ్లి వస్తుండగా, రాయచోటి-కడప రహదారిలోని సుబేదార్‌ మడ్డి వద్ద గుర్తుతెలియని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. ప్రభావతి అక్కడికక్కడే మృతి చెందగా, రాయచోటి ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు పెర్కొన్నారు.