సోమశిలలో 65.4 మి.మీ వర్షపాతం నమోదు

సోమశిలలో 65.4 మి.మీ వర్షపాతం నమోదు

NLR: అనంతసాగరం మండల వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి జోరుగా వర్షం కురుస్తుంది. దీంతో గ్రామాల్లోని పలు అంతర్గత రహదారులు జలమయమయ్యాయి. స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పలు పాఠశాలలకు మంగళవారం మధ్యాహ్నం నుంచి సెలవులు ఇచ్చారు. సోమశిలలో 65.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.