'ఎమ్మెల్యే పై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి'

SRPT: తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు మందుల సామెలుపై సోషల్ మీడియాలో తప్పుడు వీడియోలు, పోస్టులు షేర్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తప్పుడు సమాచారం ద్వారా ఎమ్మెల్యే పరువు దెబ్బతీసేలా కుట్రపూరితంగా వీడియోలు షేర్ చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.