సీఎం సలహాదారు పదవికి వేం నరేందర్ రెడ్డి రాజీనామా
HYD: సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో, గురువారం ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. అనంతరం హైదరాబాద్‌లో రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.