VIDEO: సీతారాంపురంలో ప్రజా దర్బార్.. పాల్గొన్న ఎంపీ
SKLM: ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురం పంచాయతీలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రధానంగా పెన్షన్, ఇళ్ల స్థలాలు, రెవెన్యూ సమస్యలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.