లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: DSP

MLG: జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో లోతట్టు, జంపన్నవాగు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని DSP రవీందర్ శనివారం సూచించారు. ప్రవాహం ఉన్న వంతెనలు, కల్వర్టులు, రహదారులపై ప్రయాణం చేయవద్దని, శిథిల ఇండ్లలో ఉండరాదని, తడి విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు తాకవద్దని హెచ్చరించారు.