'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

కృష్ణా: పమిడిముక్కలు సీఐ వై.చిట్టిబాబు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈరోజు రాత్రి నుంచి కృష్ణానది నీటి మట్టం పెరుగుతుందని, పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో కమ్యూనికేషన్ కోసం మొబైల్ ఫోన్లు ఛార్జ్ చేసి ఉంచుకోవాలని, వరద ముప్పు ప్రాంతాల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఎమర్జెన్సీ కిట్లు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.