వృద్ధురాలి మెడలో విలువైన బంగారు చోరీ
కృష్ణా: వృద్ధురాలి మెడలో నుంచి గొలుసు చోరీ చేసిన ఘటన జిల్లాలో సోమవారం కలకలం రేపింది. మోపిదేవి మండలంలోని రావివారిపాలెం గ్రామంలో గుర్తు తెలియని మహిళ ఓ వృద్ధరాలు ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో మెడలో నుంచి సూమారు రూ.10 లక్షల విలువైన బంగారు గొలుసు, చెవిదిద్దులు చోరీ చేసింది. ఈ ఘటనపై చల్లపల్లి సీఐ ఈశ్వరరావు, ఎస్ఐ గోపికృష్ణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.