బుగ్రేటర్ విశాఖలో ‘ఆపరేషన్ లంగ్స్’ జోరు
VSP: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ‘ఆపరేషన్ లంగ్స్’ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా ఏర్పాటైన 281 ఆక్రమణలను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు. ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాలను స్వాధీనం చేసుకున్నారు.