స్వాతంత్య్ర దినోత్సవానికి సర్పంచ్‌కు ఆహ్వానం

CTR: ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరు కావాలని చౌడేపల్లి మండలం గడ్డంవారిపల్లెకు చెందిన సర్పంచ్ భాగ్యవతికి ఆహ్వానం అందింది. ఈ మేరకు సర్పంచ్ దంపతులు ఢిల్లీకి పయనమయ్యారు. పంచాయతీ పరిధిలో వాటర్ షెడ్ పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించి ఆదర్శంగా నిలవడంతో ఆమెకు ఆహ్వానం అందినట్లు ఆమె పేర్కొన్నారు.