VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు మృతి
NLG: గుర్రంపోడు మండలం ములకలపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరెంటు స్తంభాలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో, స్తంభాలు మీద పడి పోచంపల్లి గ్రామానికి చెందిన సత్యనారాయణ, సైదులు అనే ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఈప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.