కారంచేడు గణేశుడి లడ్డూ రూ. 40,100

BPT: కారంచేడు గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి నిమజ్జన కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. కమిటీ సభ్యులు నిర్వహించిన లడ్డూ వేలం పాటలో స్వామి వారి లడ్డూను గ్రామానికి చెందిన భక్తుడు రూ.40,100లకు దక్కించుకున్నాడు. మరొక భక్తుడు స్వామి వారి టాక్టర్ పాటను రూ. 41,100లకు దక్కించుకున్నాడు. నిమజ్జన కార్యక్రమంలో యూత్ సభ్యులు పాల్గొన్నారు.