జిల్లా ఎస్పీ నేపథ్యం ఇదే..!
BPT: జిల్లా ఎస్పీగా ఉమామహేశ్వర్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమామహేశ్వర్ ప్రస్తుతం సీఐడీ విభాగంలో ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో గురజాల, కడప, ఆదిలాబాద్ జిల్లాలో డీఎస్పీగా పని చేశారు. అనంతరం ఏఎస్పీగా పదోన్నతి పొంది అదిలాబాద్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో బాధ్యతలు స్వీకరించారు.