ముదిరాజ్ నాయకుల ముందస్తు అరెస్ట్..!
NLG: హలో ముదిరాజ్ - చలో గాంధీ భవన్ ముట్టడికి తరలివెళ్తున్న ముదిరాజ్ నాయకులను మర్రిగూడ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏ లో చేరుస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తరువాత విస్మరించిందన్నారు. ప్రభుత్వనికి ముదిరాజుల సత్తా ఏమిటో చూపిస్తామన్నారు.