100 శాతం రాయితీపై విత్తనాలు పంపిణీ: ADA
ASR: సమ్మర్ సీజన్ వాల్యూ చైన్ క్లస్టర్ స్కీం కింద రైతులకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చేస్తామని చింతపల్లి ఏడీఏ తిరుమలరావు తెలిపారు. గురువారం చౌడుపల్లి సచివాలయంలో ఏవోలు మధుసూధనరావు, గిరిబాబు, శివరామ్‌తో కలిసి పలువురు రైతులకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చేశారు. చింతపల్లి పరిధిలో 2వేల ఎకరాలకు 1,140క్వింటాళ్ల విత్తనాలను 100శాతం రాయితీపై పంపిణీ చేస్తామన్నారు.