భర్త వేధింపులతో వివాహిత ఆత్మహత్య

భర్త వేధింపులతో వివాహిత ఆత్మహత్య

పార్వతీపురంలో ఓ వివాహిత భర్తవేదింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. గాసివీదికి చెందిన ఈశ్వరి(32) ని మద్యం తాగివచ్చి భర్త మురళి వేధించాడని పుట్టింటికి వెళ్లిపోయింది. శుక్రవారం తిరిగి రాగా మళ్ళీ వేదింపులకు గురిచేయడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగింది. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.