భూ రికార్డుల ప్రక్షాళనపై కలెక్టర్ సమీక్ష
సత్యసాయి: పుట్టపర్తిలోని కలెక్టరేట్‌లో సోమవారం రెవెన్యూ అంశాలపై జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యంపై తహశీల్దార్లపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గడువు దాటిన అర్జీలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. భూ రీ-సర్వే పనులను వేగవంతం చేసి ఏప్రిల్ 30 నాటికి లక్ష్యాలను చేరాలని సూచించారు.