లెబనాన్ దాడిపై భారత్ ఆగ్రహం
లెబనాన్‌లో ఐరాస శాంతి పరిరక్షక దళంపై జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ 'X' వేదికగా ఈ దాడిని తప్పుబట్టారు. అంతర్జాతీయ శాంతి పరిరక్షణలో భారత్ ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తుందని, శాంతి దళాల భద్రతపై రాజీ పడకూడదని ఆయన స్పష్టం చేశారు. కాగా, మరోవైపుఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.