VIDEO: ఒంటిమిట్ట రామయ్యకు గోటి తలంబ్రాల సమర్పణ
KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం గోటి తలంబ్రాలను సమర్పించారు. శ్రీవారి సేవకులు తయారు చేసిన ఈ తలంబ్రాలను ఆలయంలోని మూలవిరాట్ చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఈ తలంబ్రాలను సీతారాముల కళ్యాణం రోజు భక్తులకు ఇచ్చే ముత్యాల తలంబ్రాలలో కలపనున్నట్లు జిల్లా శ్రీవారి సేవకుల ఇంచార్జ్ తెలిపారు.