ఒంటిమిట్టలో తప్పిన ప్రమాదం

ఒంటిమిట్టలో తప్పిన ప్రమాదం

కడప: ఒంటిమిట్ట శ్రీ కోదండరామ ఆలయం వద్ద తృటిలో పెను ప్రమాదం తప్పింది. సీఎం చంద్రబాబు దర్శనానికి రానున్న సమయంలో ఆలయం సమీపంలో జనరేటర్ ఒక్కసారిగా పేలడంతో పరిసర ప్రాంతం మొత్తం పొగతో కమ్ముకుంది. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. జనరేటర్లోని డీజిల్ ట్యాంక్ పేలుంటే భారీ ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు.