VIDEO: వేయి స్తంభాల ఆలయంలో భక్తుల సందడి

HNK: వినాయక చవితిని పురస్కరించుకొని ఇవాళ ప్రసిద్ధిగాంచిన వేయి స్తంభాల ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఈ సందర్భంగా వినాయకుని దర్శించుకునేందుకు నగర భక్తులు తరలివచ్చి వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. వేయి స్తంభాల ఆవరణలో ఉన్న నంది విగ్రహం వద్ద భక్తులు సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.