VIDEO: అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం
JN: జనగామ మండలం చీటకోడూరు గ్రామ పంచాయతీ అక్రమ ఇసుక, మట్టి తరలింపుపై కఠిన హెచ్చరికలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, అనుమతి లేని వాహనాలపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఎమ్మార్వో కార్యాలయం నుంచి అనుమతి పొందిన ట్రాక్టర్లు, టాటా ఏసీ వాహనాలు మాత్రమే రవాణా చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని గ్రామస్తులకు చాటింపు ద్వారా తెలియజేశారు.