VIDEO: రెండు లారీలు ఢీ.. తృటిలో తప్పిన ప్రమాదం

KKD: పెద్దాపురం మండలం దివిలి సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదం ప్రజలకు దడ పుట్టించింది. అతి వేగంగా వస్తున్న రెండు టిప్పర్ లారీలు ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. వర్షం కారణంగానే ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. రెండు లారీల మధ్య ఒక బైక్ పై వస్తున్న వ్యక్తి తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నట్లు స్థానికులు తెలిపారు.