మంగళగిరిలో రత్నాల ఫ్యాక్టరీ: మంత్రి
AP: గుజరాత్‌లోని సూరత్ తరహాలో గుంటూరు జిల్లా మంగళగిరి కేంద్రంగా రత్నాల ఫ్యాక్టరీ నెలకొల్పేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. మంత్రి లోకేష్ చొరవతో ఈ ఫ్యాక్టరీ, క్లస్టర్ ఏర్పాటు కోసం 12 ఎకరాలు కేటాయించినట్లు చెప్పారు. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు నిర్వహిస్తున్న బీ2బీ జ్యూయలరీ ఎగ్జిబిషన్‌ను మంత్రి ప్రారంభించారు.