సెలవుల్లో సేదతీరడానికి మన్యం బెస్ట్ డెస్టినేషన్
PPM: ప్రకృతి ప్రేమికులకు జిల్లా ఒక అద్భుతమైన పర్యాటకంగా మారింది. పచ్చని కొండలు, పరవళ్లు తొక్కే జలపాతాలతో పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. సీతంపేట ఏజెన్సీలోని అడ్వెంచర్ పార్క్, గిరిజన మ్యూజియం పర్యాటక కళను పెంచుతున్నాయి. తడికొండ, కొత్తపల్లి సహజసిద్ధ జలపాతాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. సెలవుల్లో సేదతీరడానికి మన్యం ఇప్పుడు బెస్ట్ డెస్టినేషన్‌గా నిలుస్తోంది.