జిల్లాలో నీట్ పరీక్ష ప్రశాంతం

జిల్లాలో నీట్ పరీక్ష ప్రశాంతం

GNTR: గుంటూరు, తెనాలిలో నీట్-యూజీ 2025 పరీక్ష 16 కేంద్రాల్లో నిర్వహించారు. మొత్తం 4,250 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 4,153 మంది హాజరై 97.71% హాజరుతో పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఆయా పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకున్నారు.