VIDEO: అర్థరాత్రి నాలుగు ఇళ్లల్లో చోరీ

KMM: సత్తుపల్లి పట్టణంలోని సింగరేణి క్వార్టర్స్‌లో శనివారం రాత్రి 2:30 గంటల సమయంలో 4 ఇళ్ళల్లో చోరీ జరిగింది. ఇంటికి తాళాలు వేసిన ఇళ్లను చూసుకొని దుండగులు చోరికి పాల్పడ్డారని స్థానికులు తెలిపారు. ఘటనపై క్లూస్ టీం, పోలీసులు రంగప్రవేశం చేశారు. సీసీ టీవీ ఫుటేజ్‌లు పరిశీలించి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.