VIDEO: ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడు మృతి
JGL: మెట్‌పల్లి బస్టాండ్‌లో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. NZB నుంచి HNKకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, బస్టాండ్‌లోకి వస్తున్న సమయంలో నియంత్రణ కోల్పోయి బుడగ జంగం కాలనీకి చెందిన దుర్గయ్య అనే వృద్ధుడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.