నరసాపురంలో పర్యటించిన ఎమ్మెల్యే

ELR: నరసాపురం మున్సిపాలిటీ పరిధిలోని 1, 2వ వార్డులను ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సందర్శించారు. ఈమేరకు క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను విని, అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటానని అన్నారు. ప్రతి ఇంటికి అభివృద్ధి చేరే వరకు విశ్రమించేది లేదని ప్రజలకు తెలియజేశారు.