మొక్కజొన్న కొనుగోలు జాప్యంపై బీజేపీ నిరసన
JN: పాలకుర్తి చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్‌లో మొక్కజొన్న కొనుగోళ్లపై బీజేపీ నాయకుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర నేత లేగ రామ్మోహన్ రెడ్డితో పాటు నాయకులు మార్కెట్‌ను సందర్శించి రైతులతో మాట్లాడారు. అనంతరం కొనుగోలు జాప్యంపై నేతలు రాజీవ్ చౌరస్తాలో ప్రధాన రోడ్డుపై బైఠాయించి నిరసన ప్రదర్శన చేపట్టారు. కొనుగోళ్లను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.