'మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలి'

BDK: దేశంలో రోజురోజుకి పెరిగిపోతున్న మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా వేగంగా విస్తరిస్తున్న కార్పొరేట్ రంగానికి వ్యతిరేకంగా పోరాటాలను నిర్వహించడమే కామ్రేడ్ సీతారాం ఏచూరికి మనమిచ్చే నిజమైన నివాళి అని సీపీఐఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. గురువారం భద్రాచలం స్థానిక చందర్రావు భవనంలో సీపీఎం ఆధ్వర్యంలో ఏచూరి వర్ధంతి సభ నిర్వహించారు.