జాతీయ లోక్ అదాలత్‌లో 137 కేసులు పరిష్కారం

జాతీయ లోక్ అదాలత్‌లో 137 కేసులు పరిష్కారం

CTR: చిత్తూరు జిల్లా పుంగనూరు కోర్టు ఆవరణలో ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు సీనియర్ సివిల్ జడ్జి షేక్ అరీఫా అధ్యక్షతన శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 137రకాల కేసులు పరిష్కారమైనట్లు సీనియర్ సివిల్ జడ్జి కార్యాలయం శనివారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం సభ్యులు, కక్షిదారులు పాల్గొన్నారు.