మృతుని కుటుంబానికి కొలికపూడి అండ

మృతుని కుటుంబానికి కొలికపూడి అండ

NTR: గంపలగూడెం మండలం చింతలపాడు ఎస్సీ కాలనీకి చెందిన మోదుగు శ్రీను ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, దిక్కు కోల్పోయిన ఆ కుటుంబానికి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అండగా నిలిచారు. పెద్దకర్మ ఖర్చుల నిమిత్తం ఆయన రూ.50 వేల ఆర్థిక సహాయం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.