'సులభ రచనలతో విద్యార్థులకు మేలు'

'సులభ రచనలతో విద్యార్థులకు మేలు'

GDWL: సులభతరమైన రచనలు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు మరింత మేలు చేస్తాయని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాసీమ్ పేర్కొన్నారు. అయిజకు చెందిన అజయ్, మనీషా, స్వప్న తయారు చేసిన 5వ తరగతి గురుకుల కోచింగ్ పుస్తకాలను శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన పరిశీలించి ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా మరిన్ని రచనలు చేసి విద్యార్థులకు మంచి చేయాలన్నారు.