యుద్ధం.. ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

యుద్ధం.. ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ప్రాంతీయ భద్రత, శాంతి స్థాపనపై సుదీర్ఘంగా ఇరు దేశాల నేతలు చర్చించారు. యుద్ధం కారణంగా పౌరుల మరణాలు, మౌలిక సదుపాయాల విధ్వంసంపై మోదీ విచారం వ్యక్తం చేశారు. మధ్యప్రాచ్యంలో భారతీయ పౌరుల భద్రత, క్షేమమే తమ ప్రథమ ప్రాధాన్యత అని వివరించారు.